అశ్వాపురం మండలం మొండికుంటలో ఎస్సై షేక్ సైదా రహుఫ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.