ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని అన్ని గ్రామాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మధిర మండల ఎమ్మార్వో రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 రోజుల పాటు ఈ సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ సర్వేకు సహకరించవలసిందిగా కోరారు.