ప్రజలందరీ సహకరంతోనే తాను ఉన్నతస్థాయికి ఎదుగుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని బల్లేపల్లి మూడవ డివిజన్లోని మలీదు జగన్ వారి మామిడి తోటలో శ్రీమొల్లమాంబ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. ప్రజల ఆశీస్సులు, దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు.