ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బెజ్జీ పోలీసు స్టేషన్ పరిధిలోని భండార్ పదర్ గ్రామానికి చెందిన సోయం పాండు (53) అనే వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న పాండును గురువారం మావోయిస్టు పదునైన ఆయుధంతో హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.