జంగారెడ్డిగూడానికి చెందిన రామిశెట్టి నాగేశ్వరరావు(60) ఇటీవల తన తమ్ముడి గ్రామమైన ఊట్లపల్లికి వచ్చాడు. తమ్ముడితో ఈనెల 5న జంగారెడ్డిగూడెం వెళుతున్నానని చెప్పి మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని రాఘవయ్య చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అప్పుల బాధ తాళలేకనే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.