ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ప్రారంభమైంది బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు జనసేన MLAలకు పవన్ వివరించారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉ.9.30 గంటలకు సభ్యులందరూ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు MLAలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు పాసులు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు.