హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మార్చి 22న సా.7గంటలకు 'మై టూర్ MMK' పేరిట ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లైవ్ కాన్సర్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "ఈ కాన్సర్ట్‌లో అన్నయ్య సంగీతం అందించిన సినిమాల్లోని పాటలు ఉంటాయి. కానీ, ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్(OST) ఉండాలనేది నా డిమాండ్. ఆయన రీ రికార్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లను ఆయన లైవ్‌లో ప్లే చేయాలి." అని డిమాండ్ చేశారు.