వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన అన్నాడి బుచ్చి రామవ్వ కుటుంబ సభ్యులను, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హన్మాజీపేట గ్రామానికి చెందిన విక్కుర్తి దిలీప్, సుర అనిల్ కుటుంబ సభ్యులను శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా మృతి చెందడం పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.