మహాశివరాత్రి జాతర మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ స్వామివారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. లోక కళ్యాణర్థం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు.