వేములవాడలో విద్యుత్ సరఫరకు అంతరాయం ఉంటుందని టౌన్ సెస్ ఏఈ సిద్ధార్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహా శివరాత్రి ముందస్తు పనుల్లో భాగంగా చెట్లకొమ్మల తొలగింపు విద్యుత్ మరమ్మతులు పనులున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు హన్మక్కపల్లి, బాలానగర్, లాలపల్లె, కోనాయిపల్లి గ్రామాలలో వ్యవసాయ, గృహ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.