2న దేవునిపల్లి జాతర దుకాణాలకు వేలం
పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో దుకాణాలు ఏర్పాటుకు నవంబర్ 2న బహిరంగ వేలం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి ముద్దసాని శంకరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు లడ్డూ, పులిహోర, ప్రసాదం అమ్మకానికి రూ. 50వేలు డిపాజిట్, ప్యాలాలు, పుట్నాలు అమ్మకానికి రూ. 10 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.