కుటుంబాల సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులు తెలుసుకునేందుకు నిర్వహించే ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయాలను మంగళవారం సందర్శించి ఇంటింటి సర్వే సన్నద్ధతను తనిఖీ చేశారు. ప్రతి 150 కుటుంబాలను సర్వే చేసేందుకు ఒక ఎన్యుమరేటర్ ను ఎంపిక చేయాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.