దీపావళి రోజు ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంటగది, ధాన్యగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటే ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని తెలిపారు. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖశాంతులతో మనలోని అంధకారం తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుందని వెల్లడించారు.