కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం వేంనూర్, కుక్కల గూడూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రేడ్1 వడ్లకు రూ. 2320, సాధారణ వడ్లకు రూ. 2300, సన్నవడ్లకు రూ. 500 బోనస్ గా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు.