పెద్దపల్లిలో ఈ నెల 14న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయరమణరావు కోరారు. గురువారం పెద్దపల్లి, జూలపల్లి మండలం కాచాపూర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న స్థలాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పెద్దపల్లి జెండా చౌరస్తా దగ్గర జరిగే సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.