డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అనువైన స్థలాన్ని సమీకృత కలెక్టరేట్ ఎదుట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు బుధవారం పరిశీలించారు. నిరుద్యోగ యువతతో ప్రజాపాలన విజయోత్సవ సభ జరగనుందన్నారు. ఆర్డీఓ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహశీల్దార్ రాజ్ కుమార్, ఈఈ ఆర్&బీ భావ్ సింగ్ పాల్గొన్నారు.