జగిత్యాల పట్టణంలోని 15వ వార్డులో వరలక్ష్మి మహిళా సంఘం (మెప్మా)ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్, ఏవో శ్రీనివాస్, టిఎంసి రజిత, కౌన్సిలర్లు, రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.