జగిత్యాల: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

80பார்த்தது
జగిత్యాల: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల దుబ్బ రాజన్న స్వామి జాతరలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఓ వికలాంగుడు స్వామివారిని దర్శనం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన హెడ్ కానిస్టేబుల్ రాజు తన భుజాలపై వికలాంగుడిని ఎత్తుకొని దేవుడి దర్శనం చేయించారు. ఈ సహాయం వలన ఎంతో ఆనందంతో స్వామి దర్శనాన్ని పొందగలిగానని దివ్యాంగుడు తెలిపాడు.

தொடர்புடைய செய்தி