జగిత్యాల: ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ

58பார்த்தது
జగిత్యాల: ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సోమవారం డిఎస్పిలు, సిఐలకు పోలింగ్ రోజు, పోలింగ్ ముగిసిన తరువాత భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భీమ్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி