హుజురాబాద్ పట్టణంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణానికి చెందిన రాఘవరెడ్డి కుటుంబంతో సహా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించారు. వారు ప్రతిఘటించడంతో కుటుంబ సభ్యులను గాయపరిచి 70 తులాల బంగారంతో పాటు రూ. 7 లక్షలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోమవారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.