జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేస్తున్న ఆపరేటర్లను పరిశీలించారు. అనంతరం డేటా ఎంట్రీ తప్పులు లేకుండా పకడ్బందీగా ఎంటర్ చేయాలని ఆపరేటర్లకు సూచించారు. వారి వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసుధన్, డిపిఓ రఘువరన్ పాల్గొన్నారు.