ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, కొత్తపేట గ్రామాలను గురువారం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. గౌతం రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులం, తదితర అంశాలతో కూడిన సమగ్ర సర్వేను కులగణన సర్వే కార్యక్రమానికి విచ్చేసి సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ తగు సూచనలు చేశారు.