బోయినపల్లి మండలం తడగొండ, బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.