బోయిన్పల్లి మండలంలో వ్యవసాయ అధికారి ప్రణీత సమక్షంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులతో ఎస్సై పృథ్వీధర్ గౌడ్ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని వ్యవసాయదారులకు మాత్రమే పెస్టిసైడ్ మందులు విక్రయించాలని, వ్యవసాయదారులు కాని వారికి ఇతరులు ఎవరైనా పెస్టిసైడ్ మందులు కావాలని అడిగితే ఇవ్వవద్దని షాపు యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ఫర్టిలైజర్ షాపుల యజమానులు పాల్గొన్నారు.