ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారు. బుధవారం పోల్ టు పోల్ సర్వేలో మధ్యాహ్నం వరకు 2 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ ఏఈ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఎర్రమన్ను కుచ్చులో ఒకటి, ఇందిరానగర్ లో విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేశామన్నారు. గృహజ్యోతి ఉండగా, పాత బిల్లు కట్టకుండ డైరెక్ట్ పోల్ నుండి విద్యుత్ వాడుతున్నారని తెలిపారు.