ఎల్లారెడ్డి ఎర్రమన్ను కుచ్చ ప్రాథమిక పాఠశాల, కేజీబీవి, సాంఘిక సంక్షేమ గురుకుల, మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు, గురువారం మత్తమాల పీహెచ్సీ ఆధ్వర్యంలో టిడి (టెట్నస్, డిప్తీరియా) వ్యాక్సి నేషన్ నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్. శరత్ కుమార్ తెలిపారు. గురుకులాల్లో 10 నుంచి 15 ఏళ్ల లోపు విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది టెట్నస్ , డిఫ్తీరియా వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేయడం జరిగిందని తెలిపారు.