ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావును సదాశివనగర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా శాలువతో సత్కరించి, సదాశినగర్ మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్యెల్యేను కోరారు. స్పందించిన ఎమ్యెల్యే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి, పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.