విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతగా రుచిగా అందించాలని, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులోని గూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని హెచ్ ఏం హరీష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలన్నారు.