స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.