కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో సోమవారం ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి వాకిల్లలో రంగు రంగుల ముగ్గులు వేయడానికి మహిళలు సిద్ధమయ్యారు. ఆకాశంలోని చుక్కలు నేల పైకి వచ్చాయా అనేంతగ ముగ్గులు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దారు.