కొనుగోలు చేసిన వరి పంటను రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, అదే సమయంలో ట్యాబ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.