కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం తండా గ్రామంలో ఆదివారం సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి వాగ్దేవి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలు సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను తెలపాలని, అందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కారోబార్ నునవత్ సర్దార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.