కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తండా గ్రామంలో బుధవారం జిల్లా భారతీయ జనతా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి బానోతు నరేష్ నాయక్ సుమారు 40 వాటర్ క్యాన్ లను గ్రామ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచినీరు త్రాగాలి అన్నదే తన యొక్క ఆకాంక్ష అని పేర్కొన్నారు.