బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న సామాజిక కులగణన సమగ్ర సర్వేను గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రహేలా బేగం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు