కోరుట్ల: కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం, మల్లాపూర్ మండలాలలో వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి ఎస్ లత శుక్రవారం ఆకస్మికంగా తనిఖి చేశారు. మేచర్ వచ్చిన వెంటనే దాన్యంను తూకం వేసి డేటా నమోదు చేసి వెంటనే రైస్ మిల్లులకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. తాటి పత్తర్లు, మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.