మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులందరూ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ హెచ్పిసిఎల్ మంజూరు చేస్తున్న ఉపకార వేతనాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్య గురువారం తెలిపారు. మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకాం కోర్సులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.