జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి ఓంకారేశ్వర శివాలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన, దీపోత్సవం చేశారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం అని, అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉందని, ఈ మాసంలో ఎక్కువగా శివునికి, విష్ణువుకి పూజలు చేస్తారు అని పూజారులు తెలిపారు.