యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తాజాగా BCCI ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకూ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 24న మంగళవారం మొదటి వన్డే, అక్టోబర్ 27న రెండో వన్డే, అక్టోబర్ 29వ తేదీన మూడో వన్డే జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.