ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని ఆదేశించారు. అలాగే, ఏసియన్ గేమ్స్‌లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని సూచించారు.