సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం శాంతి నగర్ కాలనీ వాసులతో కలిసి అస్మన్ ఘాడ్ ఏడీఈ వినోద్ రెడ్డిని కలిశారు. కాలనీలో విద్యుత్ సరఫరా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని ఏడీఈ సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.