హైదరబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అన్నారు. కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నానని అయన చెప్పారు. అనుమతులు లేకుంటే పెద్దలవా, పేదలవా అని ఆలోచించం కూల్చడమే ఇకపై కబ్జాలు జరగకుండా చూస్తాం. హైడ్రా పనితీరు వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. వారే చెరువులు, నాలాలు, కబ్జాలను అడ్డుకుంటున్నారు అని పేర్కొన్నారు.