తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లను బీజేపీ పార్టీ స్వీకరించింది. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్ర కార్యక్రమానికి శనివారం పూనుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చేరుకున్నారు. వారితో పాటు మూసీ పరివాహక ప్రాంతానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు.