నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, సికింద్రాబాద్లోని రైల్వే కార్యాలయంలో శుక్రవారం SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నాగర్ కర్నూల్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న రైల్వే పనులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై చర్చించారు. రైల్వే అభివృద్ధికి సహకరిస్తామని జీఎం అన్నట్లు తెలిపారు.