సౌత్ కొరియా సియోల్ నగరం పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఏ. సన్నీ కుమార్, ఎస్. శ్రీనివాస్ రెడ్డి, దీపక్, తదితరులు డిప్యూటీ మేయర్ కు స్వాగతం పలికారు. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టును వేగవంతం చేసేలా చూడడమే పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.