డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసం వద్ద పులా కొండి లో నిలిచిన నీటిని తీసి పరబోశారు. డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు అరేకపూడి గాంధీ, బల్క సుమన్, వివేకానంద, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.