మల్లేపల్లి డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా చూస్తున్నామని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ జాఫర్ ఖాన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని మంగోర్ బస్తీలో కార్పొరేటర్ పర్యటించారు. స్థానికంగా పాడైపోయిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయన్న స్థానికుల పిర్యాదు మేరకు ఈ పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు.