ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 444 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.