తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇళ్ల స్థలాలను ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ ఉద్యమకారులకు రూ. 25 వేల పెన్షన్‌తో పాటు హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.