కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం లోని గాంధీనగర్ డివిజన్ లో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య మరియు శానిటేషన్ కార్మికులకు ప్యాక్ చేసిన పండ్ల రసాన్ని డిఎంసి శ్రీమతి ఉమప్రకాష్, ఎఎమ్హెచ్ఓ శ్రీమతి హేమలతల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.