పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

404பார்த்தது
పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి
ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ లో జెమినీ కాలనీలో ఉంటున్న పూస కుటుంబం ఆధ్వర్యంలో.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ నేత కె. లక్ష్మణ్​, ముషీరాబాద్ నియోజకవర్గ జీహెచ్ఎంసీ డీఎం సి. ఉమా ప్రకాశ్​, తదితరులు బియ్యం, పప్పు, కూరగాయల వంటి నిత్యావసర కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ... బీజేపీ ప్రతి కార్యకర్త ఐదుగురిని ఆదుకోవాలని పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం.. దాదాపు 15 వేల మంది పేద ప్రజలను నిత్యావసర సరుకులను అందించడం జరిగిందని.. అదేవిధంగా 30 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగిందని లక్ష్మణ్​ అన్నారు.

தொடர்புடைய செய்தி